ఏజెన్సీ మాంగ్ సమాజ ప్రజలకు న్యాయం చేయాలి

ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందజేత

జైనూర్, ఆంధ్రప్రభ : ఏజెన్సీ మండలాల్లో ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న మాంగ్ సమాజ్ దళితులకు ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని పలు డిమాండ్లతో బుధవారం కొమరం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రాన్ని సందర్శించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌లకు మాంగ్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు మావాలే దత్త మాంగ్, నాయకుడు ప్రకాష్ వినతిపత్రం అందజేశారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా పంటలు సాగు చేస్తున్న మాంగ్ సమాజ్ దళిత రైతులకు పహాణీలు మంజూరు చేయాలని, పంట రుణాలు అందించాలని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించి, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.