దాహం తీరుస్తున్న హెడ్ సొసైటీ చలివేంద్రాలు

దాహం తీరుస్తున్న హెడ్ సొసైటీ చలివేంద్రాలు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ హెడ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలునిర్వహిస్తున్నారు. ప్రతిఏడాదివేసవికాలంలో నిరుపేదలకు చల్లని నీరు తాగించి దహ0 తీర్చాలని ఉద్దేశంతో ఉట్నూర్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్, ఐబి చౌరస్తా, పాత బస్టాండ్ ప్రాంతాల్లో హెడ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు శ్రీకాంత్ జాదవ్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. గత రెండు నెలలుగా వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా దాహం తీర్చేందుకు మినరల్ చల్లటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. ప్రధాన చౌరస్తాలో ప్రజలు తిరిగే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ సంఖ్యలో ప్రజలు చలివేంద్రాలకు వచ్చి చల్లటి నీరు తాగుతూ దాహం తీర్చుకుంటున్నారు.

చలివేంద్రాలు ఏర్పాటు చేసిన హెడ్ సొసైటీ సంస్థకు ప్రజలకు సేవలందిస్తున్నందుకు అభినందిస్తున్నారు. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో హెడ్ సొసైటీ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా విద్య వైద్యం వ్యవసాయం తదితర సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతుంది. అన్ని వర్గాల ప్రజల కోసంసేవలందించాలనే లక్ష్యంతోహెడ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇంకా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని హెడ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ చైర్మన్, శ్రీకాంత్ జాదవ్ తెలిపారు.

Leave a Reply