పోలవరం పనుల పురోగతిపై లంకా దినకర్ సంతృప్తి
ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలన
ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరాలు సేకరణ
ఏలూరు/పోలవరం, ఆంధ్రప్రభ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏపీ 20 సూత్రాల పథకం చైర్పర్సన్ లంకా దినకర్ బుధవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు.
ముందుగా పోలవరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ బృందం లంకా దినకర్, పాకా వెంకట సత్యనారాయణకు పూల మొక్కలు, పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికింది. అనంతరం స్పిల్‌వే, కాఫర్ డ్యామ్, ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్, టన్నెల్స్ తదితర నిర్మాణ పనులను పరిశీలించారు.
ప్రాజెక్టు పురోగతికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్, మ్యాపులను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల పురోగతిపై లంకా దినకర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో కె. రాములు నాయక్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్, ఎస్ఈ కె. రామచంద్రరావు, ఈఈలు డి. శ్రీనివాసు, పి.వి. వెంకటరమణ, డీఈ మాధవరావు, ఇంజనీరింగ్ బృందం సభ్యులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
