మహబూబాబాద్, ఫిబ్రవరి 15 : సేవాలాల్ జయంతి వేడుకలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీ తిరుపతిరావుతో పాటు సీఐలు, ఎస్సై లు సుమారు 500మంది పోలీస్ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు చేపట్టారు. నిన్న మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అనంతాద్రి దేవస్థానం ప్రాంతంలో ఉన్న సేవాలాల్ మహారాజ్ దేవాలయం స్థలం తనదేనని ఆ ప్రాంతానికి వెళ్లగా రెవెన్యూ, పోలీస్ అధికారులు అడ్డుకొని అక్కడి నుండి పంపించారు.
ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ క్యాంపు కార్యాలయం నుంచి సేవాలాల్ మహారాజ్ దేవస్థానం వరకు భక్తులతో భారీ ర్యాలీగా వెళ్లి ప్రత్యేక పూజలు చేపడతారు.

మహబూబాబాద్ లో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను అడ్డుకున్న పోలీసులు
సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నివాసం నుండి సేవాలాల్ దేవాలయం వరకు ర్యాలీగా వెళుతున్న గ్రామంలో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపాన పోలీసులు అడ్డుకున్నారు.
