గుంటూరు, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా అమరావతి మండలం నెక్కల్లు గ్రామం వద్ద ఎస్.ఆర్.ఎం.యూనివర్సిటీకి చెందిన బస్సు దగ్ధమైంది. ఆ బస్సులో 8మంది ఉద్యోగులు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా బస్సు దగ్ధమైంది.
ప్రైవేట్ కాలేజ్ బస్సులను రవాణాశాఖ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుందన్న వాదనలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో బాపట్ల జిల్లాలో కూడా ఓ బస్సు అగ్నికి ఆహుతైన సంఘటన తెలిసిందే.