Temple Visit | సుదర్శన హోమంలో పాల్గొన్న వైసీపీ అధినేత

Temple Visit | సుదర్శన హోమంలో పాల్గొన్న వైసీపీ అధినేత

Temple Visit | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆలయానికి చేరుకున్న జగన్‌కు అర్చకులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన కలశ శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. అలాగే శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో నిర్వహిస్తున్న సుదర్శన హోమంలోనూ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో భక్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రారంభోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.