IRCTC Tourism | అందుబాటులోకి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లు
IRCTC Tourism | అందుబాటులోకి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లు
IRCTC Tourism | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : తీర్థ యాత్రలకు వెళ్లే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూలై 04 వ తేదీ నుండి జూలై 28 వ తేదీ లలో 2 ప్రత్యేక ప్యాకేజీలను “భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు” ద్వారా హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు IRCTC టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ DSGP కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. యాత్రకి సంబందించిన వివరాలు వెల్లడించారు.
ప్యాకేజీ వివరాలు:
- బైద్యనాథ్ ధామ్, అయోధ్య, కాశీ పుణ్య క్షేత్ర యాత్ర -: (SCZBG62): పూరి – కోణార్క్ – బైద్యనాథ్ ధామ్ – వారణాసి – అయోధ్య – ప్రయాగరాజ్. ఈ యాత్ర జూలై 04 వ తేదీన ప్రారంభమై జూలై 13 వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 16,400/-, 3 ఏసీ ధర 25,500/- , 2 ఏసీ ధర 33,100/- ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ ప్రారంభమై కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా వెళ్తుంది.
- అరుణాచలం – చిదంబరంతో దివ్య దక్షిణ యాత్ర : (SCZBG63): తిరువణ్ణామలై [అరుణాచలం] – రామేశ్వరం – మధురై – కన్యాకుమారి – త్రిచి – తంజావూరు – చిదంబరం. ఈ యాత్ర జూలై 20 వ తేదీన ప్రారంభమై జూలై 28 వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 15,600/-, 3 ఏసీ ధర 23,100/- , 2 ఏసీ ధర 29,500/- ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ ప్రారంభమై జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక దేశీయ విమాన ప్యాకేజీలు:
- ఉత్తర ప్రదేశ్: 6రాత్రులు/7రోజులు (టూర్ డేట్: జూలై:22) టికెట్టు ధర: Rs. 38,850 /-
- కేరళ : 6రాత్రులు/7రోజులు (టూర్ డేట్: ఆగస్టు 03) టికెట్టు ధర: Rs. 41000 /-
- లడఖ్: 6రాత్రులు/7రోజులు (టూర్ డేట్: ఆగస్టు 13) టికెట్టు ధర: Rs. 61,880 /-
- తమిళనాడు : 6రాత్రులు/7రోజులు (టూర్ డేట్: ఆగస్టు 16) టికెట్టు ధర: Rs. 37700 /-
- మధ్య ప్రదేశ్: 4రాత్రులు/5రోజులు (టూర్ డేట్: ఆగష్టు:26) టికెట్టు ధర: Rs. 30,350 /-
గమనిక : భారత్ గౌరవ్ మరియు దేశీయ విమాన ప్యాకేజీపై LTC వర్తిస్తుంది.
హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ విమాన ప్యాకేజీలు: నేపాల్, థాయిలాండ్, శ్రీలంక, యూరోప్, మలేషియా సింగపూర్ మరియు బాలి.
సౌకర్యాలు :
రైలు, బస్సు, హెూటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం), వాటర్ బాటిల్ మరియు టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు, ప్రయాణ బీమా. కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు 9701360701, 9281030740, 9281030749 లకు సంప్రదించాలని. మరిన్ని వివరాలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రదించాలని తేలిపారు.
