ఎమ్మెల్యే చొరవతో కరెంటు కష్టాలకు చెక్..

ఎమ్మెల్యే చొరవతో కరెంటు కష్టాలకు చెక్..
పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు మండలం కొండిపర్రు గ్రామంలో డిపి గూడెం ఎన్టీఆర్ కాలనీలో కరెంట్ కష్టాలు తొలిగాయి. ఇల్లు కట్టుకుని కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చొరవతో డిపి గూడెం ఎన్టీఆర్ కాలనీకి పంచాయతీ నిధులతో కరెంట్ ఇచ్చారు. ఈ కార్యక్రమం గ్రామ టిడిపి అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నూకారపు వీరాంజనేయులు, ఏకుల చిరంజీవి, గ్రామ ప్రజలు కూటమి నాయకులు గ్రామస్తులు కలిసి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ డిపి గూడెం ప్రజలు పది కాలాల పాటు చల్లగా ఉండాలని దీవిస్తూ ఎమ్మెల్యే వరల కుమార్ రాజా మేలు జన్మలో మర్చిపోలేమని ఆనందం వ్యక్తం చేశారు.
