Swimming Tragedy | కొడుకును కాపాడబోయి తల్లి కూడా…
Swimming Tragedy | కొడుకును కాపాడబోయి తల్లి కూడా…
Swimming Tragedy | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఈత నేర్చుకునేందుకు వెళ్లిన కుమారుడు నీటిలో మునిగిపోగా, అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో నెలవాయి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
స్థానికుల వివరాల ప్రకారం, చిత్తూరు జిల్లా నెలవాయి గ్రామానికి చెందిన సిద్దు (15) ఉపాధి హామీ పథకం కింద తవ్విన పారంపండ్ గుంత వద్ద ఈత నేర్చుకోవడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి వెళ్లి మునిగిపోయాడు.
కుమారుడు నీటిలో కొట్టుమిట్టాడుతున్నాడని గమనించిన తల్లి రేవతి (35) వెంటనే అతడిని రక్షించేందుకు నీటిలోకి దిగింది. అయితే ఈత రాకపోవడం, నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ఆమె కూడా మునిగిపోయింది. సమాచారం అందుకున్న గ్రామస్థులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే తల్లి, కుమారుడు మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
