అగ్నిప్రమాదాలపై అవగాహన పెంచడమే లక్ష్యం

అగ్నిప్రమాదాలపై అవగాహన పెంచడమే లక్ష్యం

బస్టాండ్ ఆవరణలో మాక్ డ్రిల్స్.. కరపత్రాల పంపిణీ

పరకాల,ఆంధ్రప్రభ: అగ్నిమాపక విధుల్లో ప్రాణాలర్పించిన అమరవీరుల స్మృత్యర్థం పరకాల అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం పరకాల బస్టాండ్ ఆవరణలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వి. భద్రయ్య ఆధ్వర్యంలో ప్రయాణికులకు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 14 నుండి 20 వరకు జరిగే ఈ వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మరియు గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలో వాటర్ డ్రిల్స్ ద్వారా ప్రదర్శించి చూపారు. విద్యుత్ భద్రత, ఎల్పీజీ (LPG) సిలిండర్ల వినియోగం, గ్యాస్ లీకేజీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు సూచనలు అందించారు. ప్రమాదాల నివారణకు సంబంధించిన గోడ పత్రికలను అంటించి, కరపత్రాలను పంపిణీ చేశారు.
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం మెండుగా ఉంటుందని, ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని భద్రయ్య కోరారు. మంటలు అంటుకున్న వెంటనే ఆదిలోనే వాటిని ఆర్పే ప్రయత్నం చేయాలని, తక్షణ సమాచారం కోసం పరకాల ఫైర్ స్టేషన్ నంబర్: 87126 99306 కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ప్రజలు మరియు ప్రయాణికులు పాల్గొన్నారు.

Leave a Reply