LSG vs GT | ప‌వ‌ర్ ప్లేలో దంచేసిన ల‌క్నో !

ల‌క్నో : గుజ‌రాత్ జేయింగ్స్ తో ల‌క్నో వేదిక‌గా జరుగుత‌న్న పోరులో.. రిష‌బ్ పంత్ నేతృత్వంలోని ల‌క్నో దంచికొడుతోంది. గుజ‌రాత్ నిర్దేశించిన 181 ప‌రుగుల ఛేద‌న‌లో.. ఓపెనర్లు లక్నో జట్టుకు శుభారంభం అందించారు. ప‌వ‌ర్ ప్లేలో వికెట్ ప‌డ‌కుండా ఓపెన‌ర్లు ఐడెన్ మార్క‌రం, రిష‌బ్ పంత్ బాదేస్తున్నారు. దాంతో 6 ఓవ‌ర్ల‌కు ల‌క్నో జ‌ట్టు 61 ప‌రుగులు సాధించింది.

ఐడెన్ మార్క‌రం (20 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో 38), కెప్టెన్ రిష‌బ్ పంత్ (16 బంతుల్లో 3ఫోర్లతో 17) ప‌రుగులు సాధించారు. వీరిద్ద‌రూ క‌లిసి తొలి వికెట్ కు 38 బంతుల్లో 65 పరుగులు జోడించారు. అయితే, 6.2వ ఓవ‌ర్లో బౌండ‌రీకి ప్ర‌య‌త్నించిన పంత్.. ప్ర‌సిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో క్యాచ్ ఔట‌య్యాడు.

ప్ర‌స్తుతం క్రీజులో మార్క‌రం – నికోల‌స్ పూర‌న్ ఉన్నారు.

Leave a Reply