లారీ, బొలెరో ఢీ..

శ్రీ సత్యసాయి బ్యూరో సెప్టెంబర్ 12 (ఆంధ్రప్రభ): కదిరి (Kadiri) నియోజకవర్గం తనకల్లు సమీపంలోని మండ్లీపల్లి వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో (Bolero) డ్రైవర్ ఓం ప్రతాప్ (30) మృతి చెందగా అతనితో పాటు వెళ్లిన రైతు అంజనప్పకు తీవ్ర గాయాలయ్యాయి.
ముదిగుబ్బ సమీపంలోని దొరిగిల్లు గ్రామానికి చెందిన రైతు అంజనప్ప (Anjanappa) పండించిన టమోటా పంటను కర్ణాటకలోని కోలార్ మార్కెట్ కు తరలించి తిరిగి వస్తుండగా కదిరి వైపు నుంచి సిమెంట్ తో వెళ్తున్న లారీ (Lorry) ఢీ కొట్టిన కారణంగా ఈ ప్రమాదం జరిగింది. బాధితుని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తనకల్లు ఎస్ఐ గోపి తెలిపారు.
