Lok Sabha | చర్చ ప్రారంభం
Lok Sabha | చర్చ ప్రారంభం
Lok Sabha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలంటూ విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. స్పీకర్‌ను తొలగించాలంటూ విపక్షాలు ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై 10 గంటల చర్చకు లోక్‌సభ అనుమతి ఇచ్చింది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాలంటే 278 మంది సభ్యుల మద్దతు అవసరం.
ప్రస్తుతం ఎన్‌డీఏకు 293 మంది, ఇండియా కూటమికి 234 మంది సభ్యుల మద్దతు ఉన్న నేపథ్యంలో ఈ తీర్మానం ఆమోదం పొందడం కష్టమే అయినప్పటికీ… సభ నిర్వహణలో బిర్లా తీవ్ర పక్షపాత వైఖరి అనుసరిస్తున్నారని, రాజ్యాంగబద్ధ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఈ చర్చతో లోక్‌సభలో రాజకీయ ఉద్వేగాలు మరింత రగిలిపోయే అవకాశం ఉంది.
