Legislative Council | మన ఊరు-మన బడి బిల్లులు విడుదల చేయండి

Legislative Council | మన ఊరు-మన బడి బిల్లులు విడుదల చేయండి
- శాసన మండలిలో చైర్మన్ గుత్తా సూచన
Legislative Council | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ‘మన ఊరు-మన బడి’ పథకం కింద రూ.360 కోట్లతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టారని, వాటి బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Sukendar Reddy) అన్నారు. ఈ రోజు శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. తన సొంత గ్రామంలోనే పాఠశాల పనులు సగంలో ఆగిపోయాయని, చలికాలంలో పిల్లలు ఆరుబయట కూర్చుంటున్నారని ఆవేదన చెందారు. నిధుల విడుదల విషయం గురించి గత ఏడాడి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణాకు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అన్ని రకాల పేమెంట్లు జరుగుతున్నాయని, కానీ ‘మన ఊరు-మన బడి’ని ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ అని పేరు మార్చి మైనింగ్ సెస్‌కు అటాచ్ చేసిందని అన్నారు. అక్కడక్కడ కొన్ని పేమెంట్లు జరుగుతున్నాయని, అయితే ప్రస్తుతం అవి కూడా ఆగిపోయాయని పేర్కొన్నారు.
