APDeputyCM | అప‌జ‌యమే.. అగ్నిజ్వాల‌!

APDeputyCM | అప‌జ‌యమే.. అగ్నిజ్వాల‌!

APDeputyCM | అదే నా రాస్తా.. నే వ‌స్తున్నా
తెలంగాణపై తగ్గనుంటున్న పవన్
వరుస ట్వీట్లతో అదరగొడుతున్న జనసేనాని
అదే నా రాస్తా అంటూ తెలంగాణ యాసలో కవిత పోస్ట్
ఏ రాస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో..
ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రాస్తా..
గుంటూరు శేషేంద్ర శర్మ కవితతో పవన్ ట్వీట్​

APDeputyCM | అమరావతి, ఆంధ్రప్రభ : తెలంగాణలో పోటీ తధ్యం అంటూ మీడియా సమావేశంలో స్పష్టం చేసిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ క‌ళ్యాణ్‌ బుధవారం ఎక్స్‌లో కీలక ట్వీట్ చేశారు. తెలంగాణపై తాను వెనుకడుగు వేసేది లేదనే అర్ధం వచ్చేలా అదే నా రస్తా అంటూ తెలంగాణ యాసలో ఉన్న ఓ కవితను పోస్ట్ చేశారు. ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో.. ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో గెలుస్తుందో, ఓడుతుందో.. కానీ ముందుకు పోతుందో.. అదే నా రస్తా.. ఏ రస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో.. ఏ రస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో.. ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రాస్తా.. అంటూ రాసుకొచ్చారు. ఈ కవితను ప్రముఖ కవి శేషేంద్ర రాశారు. దీనికంటే ముందు జై తెలంగాణ, జై భారత్, జై హింద్ అంటూ పవన్ పోస్ట్ చేశారు.

Leave a Reply