2026results | టీజీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

2026results | టీజీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ర్టంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ (TG EAPCET)-2026 ఫలితాలను ఈ రోజు రిలీజ్ అయ్యాయి. ఉన్నత విద్యామండలి ఆదివారం ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు. ఫలితాలు విడుదల చేశారు. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు చేతుల మీదుగా ఈ ఫలితాల ప్రక్రియ పూర్తయింది. ఎప్‌సెట్ పూర్తయిన ఆరో రోజే ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 1,97,241 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో 84,954 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈసారి ఫలితాలలో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత శాతం నమోదు కాగా, అమ్మాయిలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పైచేయి సాధించారు.
