Morocco-Beat-Canada : మొరాకో సూపర్​ విక్టరీ Andhra Prabha Sports Story

Morocco-Beat-Canada : మొరాకో సూపర్​ విక్టరీ Andhra Prabha Sports Story

  • కెనడాకు షాక్​
  • 3-0 తేడాతో మొరాకో విజయం
  • క్వార్టర్​ ఫైనల్​ కు రెడీ
  • ఇక ఫ్రాన్స్​ తో అమీతుమీ

(ఆంధ్రప్రభ, క్రీడాప్రతినిధి )

ఫిఫా ప్రపంచ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 (నాకౌట్) మ్యాచ్‌లో మొరాకో 3-0 తేడాతో కెనడాపై ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. అమెరికాలోని హ్యూస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొరాకో జట్టు అద్భుత ఆట తీరును ప్రదర్శించింది. కెనడా పై 3‌‌‌‌-0 గోల్స్​ తేడాతో మొరాకో గెలిచింది. తొలి అర్థభాగంలో మొరాకో గోల్​ కీపర్​ మాసిన్​ బౌనూ.. కెనడాకు అడ్డుగోడగా నిలబడి… గొక్క గోల్​ కూడా దక్కనీయలేదు. రెండవ అర్థభాగంలో మొరాకో స్టార్​ ఔనాహి చిచ్చర పిడుగులా రెచ్చిపోయాడు. ఇటు గోల్​ కీపర్​ ఢిఫెన్స్​.. అటు తిరుగులేని అటాకింగ్​ తో.. ఫిఫొ ప్రపంచ కప్​ లో మొరాకో రెండ సారి క్వార్టర్​ ఫైనల్​: చేరింది.

Morocco-Beat-Canada : ​ యాసిన్​ ఎదుట కెనడా సాహో

ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో కెనడా జట్టు అటాకింగ్‌తో ఒత్తిడి తెచ్చినప్పటికీ, మొరాకో గోల్ కీపర్ యాసిన్ బౌనూ కెనడా దూకుడుకు కళ్లెం వేశాడు, అద్భుతంగా గోల్స్​ ను తిప్పి కొట్టాడు. ఒక రకంగా కెనడాకు అడ్డుగోడగా నిలిచాడు. మొరాకో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్ ఆరంభం 5వ నిమిషంలోనే కెనడా సాకర్​ స్టార్ జోనాథన్ డేవిడ్ కొట్టిన ప్రమాదకర షాట్‌ను బౌనూ అద్భుతంగా డైవ్ చేసి పక్కకు నెట్టేశాడు. ఆ తర్వాత 10వ నిమిషంలో టాని ఒలువసేయి బాక్స్‌లో టర్న్ అయి కొట్టిన పవర్‌ఫుల్ షాట్‌ను బౌనూ తన కాలిని చాపి (stretched-out leg) అద్భుత రీతిలో సేవ్ చేశాడు. ఈ టోర్నమెంట్‌లో కెనడా జట్టుకు కార్నర్ కిక్స్ ద్వారా గోల్స్ చేసే బలమైన రికార్డు ఉంది. ఈ మ్యాచ్‌లో కెనడాకు ఏకంగా 11 కార్నర్ కిక్స్ లభించాయి. బౌనూ గాల్లోకి లేచి బాక్స్‌లోకి వచ్చిన బంతులను బలంగా పంచ్ చేస్తూ క్లియర్ చేశాడు, తద్వారా కెనడా హెడర్ గోల్స్ ను అడ్డుకున్నాడు. ఇక యరెండో అర్ధభాగంలో కెనడా ఆటగాడు తాజోన్ బుకానన్ సుదూరం నుండి కొట్టిన అత్యంత వేగవంత డిప్పింగ్ లాంగ్-రేంజ్ షాట్‌ను బౌనూ తన చేతివేళ్లతో తాకుతూ బార్ పైనుంచి పంపించి కెనడాను కోలుకోనివ్వలేదు . కెనడా ఫాస్ట్ కౌంటర్ అటాక్‌లను అంచనా వేస్తూ, బౌనూ తన బాక్స్ వదిలి ముందుకు వచ్చి క్లియరెన్స్ ఇవ్వడమే కాకుండా (టోటల్ 8 క్లియరెన్సులు), తన డిఫెండర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కమాండింగ్ ప్రదర్శన ఇచ్చాడు

Morocco-Beat-Canada : చిచ్చర పిడుగులా.. ఔనాహి

మొరాకో పూర్తిగా ఆధిక్యం సాధించింది. 50వ నిమిషంలో కెప్టెన్ అష్రాఫ్ హకీమి అందించిన ఫ్రీ-కిక్ పాస్‌తో అజ్జెదీన్ ఔనాహి తొలి గోల్ చేసి మొరాకోకు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత 82వ నిమిషంలో బ్రాహిమ్ డయాజ్ ఇచ్చిన అద్భుత పాస్‌ను వాడుకుని ఔనాహి మరో సూపర్‌ గోల్ చేసి జట్టు స్కోరును 2-0కి చేర్చాడు. మ్యాచ్ ఇంజూరీ టైమ్‌లో (90+8వ నిమిషంలో) సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన సౌఫియాన్ రహిమి మూడవ గోల్ కొట్టి కెనడా ఆశలపై నీళ్లు చల్లాడు. అంతే… కెనడా ఓడిపోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఔనాహి దక్కింది. ఈ ఓటమితో సహ-ఆతిథ్య దేశం కెనడా టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన మొరాకో, తదుపరి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.