బదిలీపై వెళ్తున్న కార్యదర్శి ముత్యం రెడ్డికి ఘన సన్మానం

  • దిల్దార్‌నగర్‌లో సేవలకు ప్రశంసలు
  • నూతన కార్యదర్శి భూమేష్‌కు ఘన స్వాగతం

కడెం, జూలై 5 (ఆంధ్రప్రభ): కడెం మండలంలోని దిల్దార్‌నగర్ గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా విశిష్ట సేవలు అందించి బదిలీపై వెళ్తున్న ముత్యం రెడ్డికి ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఘనంగా సన్మానం నిర్వహించారు. అదే సందర్భంగా గ్రామానికి నూతనంగా నియమితులైన పంచాయతీ కార్యదర్శి భూమేష్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు.

గ్రామ సర్పంచ్ బద్దనపల్లి స్టీఫెన్, ఉపసర్పంచ్ ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారిద్దరికీ శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ముత్యం రెడ్డి గ్రామాభివృద్ధికి కృషి చేశారని కొనియాడగా, భూమేష్ కూడా అదే స్ఫూర్తితో గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఫాలోవర్స్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు కమలాకర్, గ్రామ వీడీసీ చైర్మన్ మాదాడి సత్యనారాయణరావు, నాయకులు వేములవాడ రవి, దాసరి సుగుణాకర్, బుర్ర రాజా, రమేష్ గౌడ్, ఆంజనేయులు, అంతర్పుల నవీన్, కుందూరి చంద్రశేఖర్, శనిగారపు నరేష్, పులి రాజేష్, బైటిపెల్లి నడిపి, జీఎస్‌ఎఫ్‌ఏ వసంత శ్రీనివాస్‌తో పాటు వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.