అర్థరాత్రి దుండగుల దుశ్చర్య..

అర్థరాత్రి దుండగుల దుశ్చర్య..

మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం మండలంలోని దేవుని చెరువు గ్రామంలో అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనానికి నిప్పంటించి దగ్ధం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుడు పెనుమల్లి నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన తమ్ముడు నాగార్జున అనారోగ్యంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో అక్కడికి వెళ్లి, అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. రాత్రి సుమారు 1:10 గంటల సమయంలో నిద్రపోయిన అనంతరం, గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి బయట పార్క్ చేసి ఉన్న హీరో హోండా స్ప్లెండర్ ప్రో (రిజిస్ట్రేషన్ నంబర్: AP16 CA 3018) ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు.

ఉదయం నిద్రలేచి బయటకు వచ్చిన నాగరాజు తన బైక్ పూర్తిగా కాలిపోయి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.