బాబుజికి ఘన నివాళులు…

బాబుజికి ఘన నివాళులు…
పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా కార్యాలయంలో మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలు వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు ఎండీ రుహుల్లా పాల్గొని వైసీపీ శ్రేణులు సమక్షంలో బాబుజి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ నగర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెళ్లిపోగు రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. అజిత్ సింగ్ నగర్ బీసీటీసీ కార్యాలయంలో ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ. మంగలపూడి జోసెఫ్ ఆదివారం బాబుజి118వ జయంతి సందర్భంగా బాబు జగజ్జివన్ రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
