మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శం

  • జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమని పెద్దపల్లి జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి తెలిపారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్దంతి , కొణిజెటి రోశయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ దొడ్డి కొమురయ్య, కొణిజెటి రోశయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో నేల రాలిన తొలి అమరుడని, నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగుర వేసేందుకు ప్రాణాలు పణంగా పెట్టిన గొప్ప యోధుడు కొమురయ్య అని, ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.

కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వైయస్సార్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారని, ఆర్థిక శాఖ తోపాటు రోడ్లు భవనాలు రవాణా శాఖ మంత్రిగా హౌసింగ్ శాఖ మంత్రిగా విద్యుత్ శాఖ మంత్రిగా హోమ్ మినిస్టర్ వైద్య ఆరోగ్యం, విద్యాశాఖ మంత్రిగా కూడా కొంతకాలం తన సేవలు అందించారని, వైయస్సార్ హఠాన్మరణం తర్వాత
ముఖ్యమంత్రి గా కొంత కాలం సేవలు అందించారని , అనంతరం తమిళనాడు గవర్నర్ గా పని చేసారన్నారు.

మహనీయులను ఒక కులానికో, ఒక వర్గానికో పరిమితం చేయకుండా ఆయన ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్ ,బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి, జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి సురేష్ , ఎస్సీ సంక్షేమ అధికారి ఎం. రవీందర్ మైనారిటీ సంక్షేమ అధికారి పి. నరేష్ కుమార్ నాయుడు ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు ఓజ్జల సదానందం, కార్యదర్శి వెలిశాల రాజశేఖర్, గిరి,మంచాల లక్ష్మన్, వెంకటేష్, ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.