Kothapeta |కొత్త‌పేట‌లో నిలిచిన ప‌త్తి కొనుగోలు

Kothapeta | కొత్త‌పేట‌లో నిలిచిన ప‌త్తి కొనుగోలు

సీసీఐ–సీసీఎస్ నూతన నిబంధనలతో మిల్లర్లు స‌మ్మె

Kothapeta | ఎండపల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : ఎండపల్లి మండలం కొత్తపేటలోని శాతవాహన (Shathavahana Jinning Mill) జిన్నింగ్ మిల్ లో ఈ రోజు నుంచి ప‌త్తి కొనుగోలు నిలుపు చేశారు. పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఐ, సీసీఎస్ అమలు చేస్తున్న కొత్త నిబంధనలు జిన్నింగ్ మిల్లులకు భారీ భారం మోపుతున్నాయని మిల్లర్లు ఆందోళ‌న‌కు దిగారు. నాణ్యత ప్రమాణాలు, కొనుగోలు విధానం, చెల్లింపుల పద్ధతుల్లో వచ్చిన మార్పులతో మిల్లులు కార్యకలాపాలు కొనసాగించలేని స్థితికి చేరుకున్నాయని తెలిపారు. పత్తి కొనుగోళ్లలో ఏర్పడ్డ ఇబ్బందులను నివారించేందుకు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సీసీఐ–సీసీఎస్ నిబంధనలను పునఃపరిశీలించాలని మిల్లర్లు, రైతులు కోరుతున్నారు.

Leave a Reply