కేజీబీవీ బాలికలకు ఉచిత దుస్తుల పంపిణీ
చిట్యాల (ఆంధ్రప్రభ): మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో గురువారం విద్యార్థినులకు ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రైనీ కలెక్టర్ నవీన్ రెడ్డి హాజరై విద్యార్థినులకు ఉచిత దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలతో విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వసంతరావు, ఎంపీడీవో జయశ్రీ, ఎంఈఓ రఘుపతి, పాఠశాల ప్రత్యేక అధికారి సుమలత, ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థినులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
