కారు–బైకు ఢీకొని ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

చందుర్తి (ఆంధ్రప్రభ): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని ఎన్గల్ గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైకు పరస్పరం ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో వేములవాడకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. దేవుని తండాకు చెందిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న చందుర్తి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.