ప్రయాణికులకు భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో హెడ్ కానిస్టేబుల్ తులా రమేష్ఆధ్వర్యంలో ప్రయాణికులకు ఆంజనేయ స్వామి భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవికాలంలో ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రయాణికులకు భక్తులకు చల్లటి మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు. మండుటెండల్లో ప్రయాణించే వారికి వడదెబ్బ తగలకుండా ఉపశమనం కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు అనంతరం ప్రయాణికులు భక్తులు హెడ్ కానిస్టేబుల్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply