లబ్ధిదారులకు కీలక సూచనలు… అధికారుల దృష్టి ఈ ప్రక్రియపై

డోంగ్లి, ఆంధ్రప్రభ : మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రంజిత్ కుమార్ శనివారం రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేషన్ కార్డుదారుల ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియపై ప్రధానంగా చర్చించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి రేషన్ కార్డుదారుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని తహసీల్దార్ సూచించారు. ఈ ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో సరుకుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని డీలర్లకు స్పష్టం చేశారు.
ఈ-కేవైసీ చేయించుకోని కార్డుదారులకు అవగాహన కల్పించి, ప్రక్రియ పూర్తి చేయడంలో డీలర్లు చొరవ చూపాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ పంపిణీలో పారదర్శకత, సమయపాలన పాటించాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ సాయిబాబా, సిబ్బంది సాయిలు, రేషన్ డీలర్లు షబ్బీర్ పటేల్, మాధవరావు పటేల్, హనుమంత్ రెడ్డి, సంతోష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
