నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి

పరకాల, ఆంధ్రప్రభ : సీఎస్‌ఐ మిషన్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కే.జే. థామస్ అకాల మరణం చెందడంతో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.

పరకాల పట్టణంలోని సీఎస్‌ఐ మిషన్ హైస్కూల్‌లో దీర్ఘకాలంగా ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించిన కే.జే. థామస్ మృతిపట్ల చల్లా ధర్మారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పరకాల పురపాలక సంఘం బీఆర్‌ఎస్ కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి, బీఆర్‌ఎస్ నాయకులు రేగురి విజయపాల్ రెడ్డి, దుంపేటి నాగరాజు, బండారి సుగుణాకర్, ఆర్టిస్ట్ కోటి, మడికొండ ఆనంద్, చక్రి, కార్యకర్తలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.