తమ్ముడి ఇంటికొచ్చిన వ్యక్తి అదృశ్యం..
తమ్ముడి ఇంటికొచ్చిన వ్యక్తి అదృశ్యం..
ఘట్కేసర్, ఆంధ్రప్రభ : కిరాణా షాప్ కి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లిన మేఘావత్ మోతీలాల్ (41) అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫిర్యాదుదారుడైన తమ్ముడు మేఘావత్ శ్రీను (అసిస్టెంట్ ప్రొఫెసర్) తెలిపిన వివరాల ప్రకారం.. మోతీలాల్ తన భార్యతో గొడవపడి ఎనిమిది నెలల క్రితం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్లోని శ్రీను ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు.
శుక్రవారం ఉదయం కిరాణా షాప్ కు వెళుతున్నానని తల్లితో చెప్పి బయటకు వెళ్లిన మోతీలాల్ తిరిగి రాలేదు. కాగా అదే రోజు మధ్యాహ్నం ఘట్ కేసర్లోని మినీ బ్యాంక్ వద్ద ఆధార్ వేలిముద్ర ద్వారా తన ఎస్బీఐ ఖాతా నుండి రూ. 6,000 డ్రా చేసినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
