Jhansi Lakshmibai | ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి

Jhansi Lakshmibai | మక్తల్, ఆంధ్రప్రభ : 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పోరాట యోధురాలు, భారత మహిళా శక్తికి సాధికారతకు నిలువెత్తు రూపం అస్థిత్వం ఆత్మాభిమానం కోసం ఖడ్గం చేపట్టిన వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జయంతి వేడుకలను బుధవారం నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఝాన్సీ లక్ష్మీబాయి చౌరస్తాలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి హిందూ ధార్మిక పరివార్ సంఘాల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీబాయి త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో చీరల రామ్ మాధవ్, మహేష్ సాగర్, పుల్లారి శివ, పస్పుల భీమేష్, భారత్ సాగర్ ,వాకిటి నర్సింహ, మూర్తి, వాకిటి ఆనంద్, రాహుల్, ఆంజనేయులు, సీఎం, ప్యాట బాలప్ప, వాకిటి ఆకాష్, వాకిటి రాము, బస్వారాజ్, మల్లెపల్లి నర్సింహ, నరేష్ బిల్లా తదితరులు పాల్గొన్నారు.
