JCB machine | ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.

JCB machine | ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.

JCB machine | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ఆయా అవార్డుల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు ఊట్కూర్ పట్టణంలోని కుర్వగేరి వీధిలో గత కొంత కాలంగా మురుగు నీటి గుంతలో నీరు నిల్వ ఉండి అపరిశుభ్రంగా ఉండడంతో పాటు దోమల, ఈగల బెడద తీవ్రమైందని కాలనీవాసులు గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకువెళ్లగా జేసీబీ యంత్రం(JCB machine)తో పారిశుద్ధ్య పనులు ముమ్మారంగా చేపట్టి మురుగు నీరు తొలగించారు.

ఈ సందర్భంగా ఉప సర్పంచ్ రెడ్యానోళ్ల రమేష్ మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని ప్రజలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు గూడు లేని పేదవారికి వచ్చే విధంగా చూస్తామన్నారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలన్నారు.

గ్రామంలో నెలకొన్న సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్, వార్డు సభ్యులు అక్షయ్ కుమార్, బోయిని భవిత, భరత్ కుమార్, జంగిడి మౌనిక నరసింహ తదితరులు పాల్గొన్నారు.