iran-to nuclear war I 1905 I ఇరాన్ తీరు…అణు మాన‌మే!

అణు యుద్ధానికి దారి తీస్తున్న వాతావ‌ర‌ణ‌
  • ప్ర‌పంచ దేశాల్లో ఆందోళ‌న‌
  • యూఏఈలో భ‌యాందోళ‌న‌లు
  • ఆర్థికంగా చితికిపోయిన గ‌ల్ఫ్ దేశాలు
  • అమెరికాలోనూ పెరిగిపోతున్న ఆర్థిక భారం
  • ప్ర‌తి ఇంటిపై 316 డాల‌ర్ల భారం
  • ప్ర‌పంచ దేశాల్లో ఆయిల్ సంక్షోభం
  • కుప్ప‌కూలిపోతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు
  • యూఏఈ కి త‌లొగ్గిన ట్రంప్‌
  • ఇరాన్‌పై దాడులు వాయిదా వేసిన అమెరికా

iran-to nuclear war I 1905 I ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ (అంత‌ర్జాతీయం) : ప‌శ్చిమాసియా ఉద్రిక్త‌త‌లు అణు యుద్ధానికి దారి తీసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని ఆందోళ‌న‌లు రేక‌త్తిస్తున్నాయి. ప్ర‌ధానంగా యూఏఈ లోని బరాఖా అణు విద్యుత్ కేంద్రం ఇరాన్ చేసే దాడులు ఈ సంకేతాన్ని ఇచ్చాయి. చైనాలో ప‌ర్య‌టించి స్వ‌దేశానికి చేరిన‌ అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ప్ర‌పంచం ప‌టంలో ఇరాన్ ఉండాలా? లేదో? తేల్చుకోవాల‌ని హెచ్చ‌రికాలు జారీ చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌ల‌తో ఇరాన్ యూఏఈను టార్గెట్ చేసింది. దీంతో యూఏఈ దేశాలు కూడా ఒకింత భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాయి. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌పై ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ నాయకులు ఒత్తిడికి త‌లొగ్గి ఈ రోజు ఇరాన్‌పై త‌ల‌పెట్టిన దాడుల‌ను అమెరికా వాయిదా వేసుకుంది.

iran-to nuclear war I 1905 I యూఏఐలో వ‌ణుకు ఎందుకంటే…
ప‌శ్చిమాసియా ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో యూఏఐలో వ‌ణుకు ప్రారంభ‌మైంది. ఒక‌వైపు దేశ ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతుండ‌గా, ఆర్థికంగా చితికి పోతున్నాయి. అమెరికాకు ఏయిర్ బేస్‌లు ఇచ్చినందుకు ఇరాన్‌పై అమెరికా టార్గెట్ పెట్టిన ప్ర‌తిసారి యూఏఐ టార్గెట్‌గా ఇరాన్ డ్రోన్‌ల దాడి చేస్తోంది. దీంతో యూఏఐలో విమానాశ్రాయ‌లు, ఆయిల్ రిఫైన‌రీలు ధ్వంసమ‌వుతున్నాయి.

పెట్టుబ‌డులు వెన‌క్కి వెళ్లిపోయాయి. విదేశీయ టూరిస్టులు రాక‌పోవ‌డంతో ప‌ర్య‌ట‌క ప్రాంతాలు వెల‌వెల‌బోతున్నాయి. పెద్ద‌పెద్ద హోట‌ళ్లు మూత‌ప‌డ్డాయి. కొంద‌రూ స్వ‌దేశాల వైపు ప‌య‌నించారు. ఇదంతా ఆ దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప‌డింది. ఆర్థికంగా ఆయా దేశాలు చితికిపోయాయి. దీనికి తోడు అణు విద్యుత్ కేంద్రాల‌ను ఇరాన్ టార్గెట్ చేసింది. ఆదివారం కూడా బ‌రాఖ్ అణు విద్యుత్ కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. యూరేనియం లీక్ కాన‌ప్ప‌ట్టికి భ‌విష్య‌త్తులో ఎలాంటి ముప్పు ఉంటుందో అని భ‌యంతో యూఏఐ ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. అమెరికా మొండి ప‌ట్టుప‌డితే మొద‌టిగా నాశ‌న‌మ‌య్యేవి యూఏఐ దేశాలు అనేది నిస్సందేహంగా చెప్పొచ్చు.

iran-to nuclear war I 1905 Iప‌లు దేశాల్లో కుప్ప‌కూలిపోతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌
ప‌శ్చిమాసియా ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాల్లో ఆర్థిక వ్య‌వస్థ కుప్ప‌కూలిపోతుంది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌- అమెరికా యుద్ధంతో ప్ర‌పంచంలో ఆయిల్ ధ‌ర‌లు పెరిగాయి. ఈ రోజు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 110 డాల‌ర్ల‌కు చేరింది. దీంతో ఈ రోజు కూడా భార‌త్‌లో ఆయిల్ ధ‌ర‌లు పెరిగాయి.

అలాగే పాకిస్తాన్ లో లీట‌ర్ పెట్రోల్ 445 రూపాయ‌ల‌కు చేరుకుంది. అమెరికాలో లీట‌ర్ పెట్రోల్ 1.20 డాల‌ర్లు అన‌గా 115.69 రూపాయ‌లు ఉంది. చైనాలో భార‌త్ క‌రెన్సీలో చూస్తే లీట‌ర్ 108.50 నుంచి 111 రూపాయ‌ల‌కు పెరిగింది. ఆయిల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో వాటి ప్ర‌భావం నిత్యావ‌స‌ర వ‌స్తువులు, ట్రాన్స్‌పోర్టు మీద ప‌డుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు గురించి ప‌క్క‌పెడితే చిన్న‌చిన్న దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలిపోతుంది. పూర్తిగా ఆర్థికంగా చితికిపోయిన దేశ‌మైన పాకిస్తాన్ లాంటి దేశాలు గురించి వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

iran-to nuclear war I 1905 I అమెరికాలో ప్ర‌తి ఇంటిపై 316 డాల‌ర్ల భారం
ప‌శ్చిమాసియా ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో అమెరికాలో ఆర్థిక‌భారం పెరిగిపోతుంది. అమెరికాలో యుద్దం కోసం చేసే ఖ‌ర్చుతో అటు ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. ప్ర‌స్తుత అంచ‌నా లెక్క‌ల ప్రకారం ప్ర‌తి ఇంటిపై 316 డాల‌ర్లు భారం ప‌డిన‌ట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఆందోళ‌న‌లో నేప‌థ్యంలో ఇరాన్‌పై దాడులు చేయ‌డానికి ట్రంప్ కొంత ఆలోచించాల్సి ఉంటుంది. ఇటు ప్ర‌పంచ దేశాలు, అటు అమెరికా ప్ర‌జ‌లు ఒత్తిడితో అమెరికా ఒక అడుగు వెనుక్కు వేస్తున్న‌దన‌డంలో సందేహం లేదు.

iran-to nuclear war I 1905 I ఇరాన్‌పై సైనిక దాడికి అమెరికా వాయిదా
ఇరాన్‌పై ఈ రోజు సైనిక దాడికి ప్రణాళిక వేసిన‌ ట్రంప్ వాయిదా వేశారు. దాడిని వాయిదా వేయాలని ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ నాయకుల నుంచి తనకు ప్రత్యక్షంగా విజ్ఞప్తులు వచ్చాయని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌ తెలిపారు.

దీంతో వారి అభ్యర్ధన మేరకు ఇరాన్ పై చేపట్టాలనుకున్న సైనిక దాడిని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు ప్రకటించారు. ఇరాన్‌తో జరిగే ఒప్పందంలో ఆ దేశం వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని పునరుద్ఘాటించారు. గల్ఫ్ మిత్రులపై ఉన్న గౌరవంతో ఇరాన్ పై జరగాల్సిన దాడిని నిలిపివేయాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) కు, యూఎస్ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇరాన్‌ చర్చలు విఫలమై, దానితో ఒక ఒప్పందం కుదరకపోతే.. విధ్వంసకర రీతిలో దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.

iran-to nuclear war I 1905 I అది లొంగిపోయినట్లు కాదు: ఇరాన్
అమెరికాతో చర్చలు కొనసాగుతున్న‌ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెషియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల్లో పాల్గొనడం అంటే లొంగిపోయినట్లు కాదన్నారు. దేశ హక్కులను పరిరక్షిస్తూనే.. తాము చర్చల్లో పాల్గొంటున్నామన్నారు. ఈ సందర్భంగా దేశం, ప్రజల చట్టపరమైన హక్కుల విషయంలో వెనకడుగు వేసేది లేదన్నారు. ఈ క్ర‌మంలో హోర్మూజ్ జలసంధి, అణు కార్యక్రమం వంటి విషయాల్లో అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

iran-to nuclear war I 1905 I ఈసారైనా చర్చలు సాగేనా..?
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఇంకా ఎటూ తేలడం లేదు. ఇరు దేశాల మొండి వైఖరితో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఒక దేశం పంపిన ప్రతిపాదనలు ఇంకో దేశానికి నచ్చడం లేదు. దీంతో కనీసం చర్చలు కూడా జరగడం లేదు. తాజాగా అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు పంపింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్‌ ద్వారా 14 అంశాలతో కొత్త ప్రతిపాదనల‌ను అమెరికాకు పంపినట్లు తాజా సమాచారం.

యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నామని ఇటీవలే ఇరాన్ ప్రకటించింది. అయితే, అమెరికా చేస్తున్న డిమాండ్లు అనుచితంగా ఉన్నాయని ఇరాన్ విమర్శించింది. ఇదే సమయంలో యుద్ధానికి ముగింపు పలికేలా ఇరాన్‌ను చర్చలకు ఒప్పించడం కోసం పాకిస్తాన్ మంత్రి మోసిన్ నక్వీ ప్రస్తుతం ఇరాన్‌లో పర్యటిస్తున్నారు. ఇరాన్ ప్రధాన డిమాండ్లకు సంబంధించి.. విదేశాల్లో ఉన్న తమ దేశపు ఆస్తుల్ని విడిపించడంతోపాటు, చాలాకాలంగా తమపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలని కోరుతోంది.

అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు సానుకూలంగా లేకపోతే ఇరు దేశాల మధ్య మరోసారి యుద్ధం తప్పేలా లేదు. అవసరమైతే మళ్లీ యుద్ధం ప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నాయి.

ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటించారు. తాము కూడా యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. మరికొంత కాలం యుద్ధం కొనసాగితే.. చమరు సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుతుంది.

Leave a Reply