జైనూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

తెలంగాణ సాధనలో జయశంకర్ సేవలు చిరస్మరణీయం

జైనూర్, ఆంధ్రప్రభ: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ ఆడ బీర్షావ్ ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో కలిసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ జీవితాంతం కృషి చేశారని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం చిరస్మరణీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ కృష్ణమోహన్, ఉద్యోగులు భరత్, విట్టల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.