Iran-Israel war | దిగుమతులు కష్టం…

Iran-Israel war | దిగుమతులు కష్టం…
Iran-Israel war | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా (West Asia) లో కొనసాగుతున్న యుద్ధం వారం దాటితే భారత్‌కు ఆర్థికంగా, ముఖ్యంగా ఆహార సరఫరాల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది భారత్ సుమారు 5 నుంచి 6 మిలియన్ టన్నుల పప్పు దినుసులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. వీటిలో కొంత భాగం ఇరాన్ మార్గం (Iranian way) లేదా గల్ఫ్ ప్రాంతం ద్వారా రవాణా అవుతోంది. దీంతో దిగుమతులు కష్టతరంగా మారతాయి.
ప్రస్తుతం యుద్ధ ఉద్రిక్తతల కారణంగా సముద్ర రవాణా మార్గాలు ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సమీపంలోని వ్యూహాత్మక సముద్ర మార్గాలు (Sea routes) పూర్తిగా మూతపడితే లేదా రవాణాji అంతరాయం కలిగితే పప్పు దినుసుల దిగుమతులు కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో దేశీయ మార్కెట్‌లో సరఫరా తగ్గి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇంధన ధరలతో పాటు ఆహార దిగుమతులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తోంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే సరఫరా గొలుసు (సప్లై చైన్)పై ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
