మార్పుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం..

మార్పుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం..

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైన మార్పుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. గత ఐదేళ్ల పాలనలో రైతన్నలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, బుధవారం అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల భూములపై గత ప్రభుత్వం ఏ రకమైన పెత్తనం చలాయించారో మనమందరం చూశామని కానీ, ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, రైతన్నకు అసలైన ‘భూ హక్కు’ కల్పిస్తోందని అన్నారు పాస్‌బుక్ అనేది రైతు కష్టార్జితంతో కొనుక్కున్న భూమికి సాక్ష్యమని అది ప్రభుత్వ ఆస్తి కాదని , జగన్ సొంత ఆస్తి అసలే కాదని ఆ పాస్‌బుక్కులపై జగన్ ఫోటోలు వేసుకోవడమేంటని ప్రశ్నించారు.

జగన్ ఫోటోలను తొలగించి, భారత ప్రభుత్వ రాజముద్రను గౌరవప్రదంగా ముద్రించడం రైతన్న ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం అని అన్నారు సర్వే రాళ్ల పై మీ బొమ్మలు చెక్కించుకోవడానికి 700 కోట్లు తగలేశారని అన్నారు ఆ 700 కోట్లు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చి ఉంటే ఎంతో మేలు జరిగేదని అన్నారు ఆ రాళ్లను చూసి రైతులు నవ్వుకుంటున్నారని కూటమి ప్రభుత్వం ఆ వృధా ఖర్చుకు స్వస్తి పలికిందని అన్నారు . ఇకపై పొలాల్లో ఉండేది సర్వే నంబర్లు మాత్రమే, ఎవరి ఫోటోలు ఉండవని పేర్కొనారు గతంలో రీ-సర్వే పేరుతో రైతుల భూములను ఇష్టం వచ్చినట్లు తారుమారు చేశారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ టెక్నాలజీని రైతు క్షేమం కోసమే వాడతారని గతంలోనే ‘మీ భూమి’ పోర్టల్ తెచ్చింది ఆయనేనని ఇప్పుడు ఆధునిక పద్ధతుల్లో, ఎటువంటి వివాదాలు లేని భూ యాజమాన్యాన్ని రైతులకు అందిస్తామని అన్నారు .

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తూనే, వారి భూములకు రక్షణ కవచంలా కూటమి ప్రభుత్వం నిలుస్తున్నది పేర్కొన్నారు గత ప్రభుత్వం రైతులను ఓటు బ్యాంకులా చూసింది, కానీ కూటమి ప్రభుత్వం రైతులను రాష్ట్రానికి వెన్నెముకగా చూస్తోందని రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని పండుగలా మారుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి బసవేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు మండలి రామమోహన రావు,అవనిగడ్డ క్లస్టర్ ఇంచార్జ్ బండే రాఘవ,అశ్వరావుపాలెం నీటి సంఘాల అధ్యక్షులు దాసినేని శ్రీనివాసరావు,రాజశేఖర స్వామి దేవస్థానం చైర్మన్ ఘంటసాల రామమోహనరావు పార్టీ నాయకులు కంచర్ల ఆనంద్, నాగిడి రాంబాబు,ముళ్లపూడి శ్రీనివాసరావు,కొల్లూరి వాసు,కొండవీటి గోవింద్,నాగిడి సుబ్రహ్మణ్యం,పాటిబండ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply