ఘనంగా శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం..

ఘనంగా శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం..

భీమారం, ఆంధ్ర ప్రభ : గ్రేటర్ పరిధిలోని 55 డివిజన్ భీమారం గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జగద్గురు మద్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధన గురుపూజోత్సవం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో చెట్ల పల్లి అజయ్ ఆచార్యలు గణపతి పూజ తో మొదలు కొని అన్ని పూజ క్రతువు లు చేశారు.అనంతరం ఆయన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రచించిన కాలజ్ఞాన మహత్యాన్ని కాసేపు భక్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సంఘం ముఖ్యలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply