టీఆర్పీ సభ్యత్వంతో బీమా భరోసా

అచ్చంపేటలో నమోదు కార్యక్రమం ప్రారంభం

అచ్చంపేట మే 23, (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం అచ్చంపేట నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ప్రవేశపెట్టిన సభ్యత్వం–బీమా పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు బీసం ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీసం ఆంజనేయులు మాట్లాడుతూ.. సభ్యత్వం పొందిన ప్రతి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రమాదవశాత్తు గాయాల పాలైతే రూ.2.50 లక్షలు, మరణించిన పక్షంలో రూ.5 లక్షల బీమా వర్తించేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. తీన్మార్ మల్లన్న ఆశయాలకు అనుగుణంగా ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే టీఆర్పీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తవిటి శైలజ, నాగర్‌కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్, పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు నిరంజన్, స్వామి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply