India | రైతులకు ఉష వ‌రి విత్త‌నంతో అధిక లాభాలు

India | రైతులకు ఉష వ‌రి విత్త‌నంతో అధిక లాభాలు

India | దండేపల్లి, ఆంధ్రప్రభ : శ్రీరామ ఆర్ జెనెటిక్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో రైతు పంట లాభదాయక పద్ధతి సమావేశాన్ని దండేపల్లి మండల కేంద్రంలోని కుంచె స్వామి అనే రైతు పొలంలో గురువారం కంపెనీ ప్రతినిధి కె మహేందర్ రెడ్డి(K Mahender Reddy) నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరామ అగ్రి జెనెటిక్స్(Srirama Agri Genetics) శ్రీరామ అగ్రి ఉష వరి విత్తనం పెట్టడంతో రైతులకు తినడానికి బాగుంటుందని అమ్ముకోవడానికి కూడా మంచి దిగుబడి రావడంతో లాభాలు అధికంగా వస్తుందన్నారు. ఉష వరి రోగనిరోధక శక్తిని కలిగి చీడపీడలను తట్టుకొని, అధిక దిగుబడి ఇస్తుందని అన్నారు. యాసంగి, రబీ సీజన్లలో పండిచుకోవచ్చని అన్నారు.

అనంతరం రైతును డీలర్ ను శాలువతో సన్మానించి యసంగిలో వేసుకునే పంటలు మొక్క జొన్న, జొన్న, కందులు, యాసంగికి అణువైన వరి, యమున, గంగ, రమ్య అను వేరైటీలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ డీలర్స్ సుదర్శన్(Seeds Dealers Sudarshan) కంపెనీ సిబ్బంది, రాజశేఖర్, రమేష్, రైతులు, సత్తయ్య, పులిశెట్టి రాజయ్య, అల్లంల కొమురయ్య, గాండ్ల విజయ్ కుమార్, బొడ్డు శంకరయ్య, కల్లూరి రాజబోయి, తదితరులు పాల్గొన్నారు.