IND vs ENG | ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం…

  • శుభ్‌మన్ అద్భుత ఇన్నింగ్స్

ఎడ్జ్‌బాస్టన్‌లో భారత జట్టు చారిత్రాత్మక ప్రదర్శనతో దూసుకెళ్లింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 83 ఓవర్లలో 427/6 వద్ద డిక్లేర్ చేసి, ఇంగ్లాండ్‌కు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులుతో విజృంభించిన గిల్, రెండో ఇన్నింగ్స్‌లో 161 బంతుల్లోనే 161 పరుగులు చేసి మరో సునామీ సృష్టించాడు. గవాస్కర్ తరువాత టెస్ట్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా చరిత్రలో నిలిచాడు.

అందుకు తోడుగా టాపార్డర్ లో కేఎల్ రాహుల్ (55), యశస్వి జైస్వాల్ (28), కరుణ్ నాయర్ (28) వంటి ఆటగాళ్లు మంచి ఆరంభాలు ఇచ్చారు.

ఆ తర్వాత రిషబ్ పంత్ (65 బంతుల్లో 72) తనదైన శైలిలో చెలరేగగా, రవీంద్ర జడేజా 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచి గిల్‌కు అద్భుతమైన మద్దతును అందించి తన 24వ టెస్ట్ అర్ధ సెంచరీని సాధించాడు. దీంతో భారత్ 83 ఓవర్లలో 427/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, ఇంగ్లాండ్ కు 608 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Leave a Reply