Incident | విశ్రాంత ఉద్యోగి మృతి

Incident | విశ్రాంత ఉద్యోగి మృతి

Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అనకాపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఏసీ పేలడంతో మంటలు చెలరేగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి పట్టణంలో ఓ నివాసంలో ఏసీ పేలిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో రేబాక రామారావు అనే విశ్రాంత ఉద్యోగి మృతి చెందారు. ఏసీ పేలుడుతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి మంచం వరకు చేరాయి. ఆ సమయంలో మంచంపై నిద్రిస్తున్న రామారావు మంటల్లో చిక్కుకుని బయటపడలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.