పోచారంలో ప్రీ-ప్రైమరీ పాఠశాలకు దరఖాస్తుల ఆహ్వానం..
పరకాల, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు, పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి పరకాల మండలంలో, ప్రాధమికోన్నత పాఠశాల, పోచారంలో ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ ని ప్రారంభించనున్నట్లు మండల విద్యాధికారి పరకాల చిలువేరు. సురేందర్ తెలిపారు. (ప్రాధమికోన్నత పాఠశాల, పోచారం ప్రధానోపాధ్యాయులు రవ్వ జగదీష్ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ విభాగాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్ (10+02) లేదా సమాన విద్యార్హత కలిగి ఉండాలని, ప్రారంభ బాల్య విద్య (ఈసీఈ) లేదా ప్రాథమిక బోధనలో అర్హతలు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయా పోస్టుకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికలో మొదట హాబిటేషన్, అనంతరం గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా ప్రాతిపదికన ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుందని చెప్పారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను సంబంధిత ప్రీ-ప్రైమరీ పాఠశాల సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ఈ నెల జూన్ 8వ తేదీలోగా సమర్పించాలని మండల విద్యాధికారి, పరకాల చిలువేరు. సురేందర్ కోరారు. వివరాలకు 7893798066 సెల్ నంబర్లు సంప్రదించాలని కోరారు.
