Service |సేవాభావంతో ఎదగాలి
Service |సేవాభావంతో ఎదగాలి
Service | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : యువత సేవాభావంతో ఎదగాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఈ రోజు ఘంటసాలకు చెందిన మదర్ థెరిస్సా సేవా సంస్థ(Service organization) అధ్యక్షుడు, విద్యుత్ శాఖ దాలిపర్రు జూనియర్ లైన్‌మెన్(lineman) కొడాలి శ్యామ్యూల్ క్రిస్మస్ పర్వదిన వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్‌లను మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మండలి వెంకట కృష్ణారావు చిత్రపటాన్ని బహూకరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, సీనియర్ న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
