ఇష్టంతో చదివితే..

ఇష్టంతో చదివితే..

చిట్యాల, ఆంధ్రప్రభ : ఇష్టంతో చదివితే రాణిస్తారని.. పదో తరగతి విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించాలని, హ్యూమన్ రైట్స్ నేషనల్ ఉపాధ్యక్షులు సంపత్ రావు అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల టెన్త్ క్లాస్ విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్ పెన్స్ ను సంపత్ రావు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని చిట్యాల, జూకల్, చల్లగరిగ, జడల్ పేట, నైన్ పాక, గోపాలపురం పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు పంపిణీ చేశామన్నారు.

టెన్త్ క్లాసులో మండల టాపర్ కి రూ 2500, మండల కేంద్రంలోని పాఠశాల స్థాయి టాపర్ కి రూ వెయ్యి చొప్పున బహుమతి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘుపతి, బొమ్మ రాజమౌళి, శనిగరపు భద్రయ్య, బుర్ర సదయ్య, నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు తిరి అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి దూడం రాజేందర్, సోషల్ జస్టిస్ హరీష్, ఎడ్యుకేషనల్ వింగ్ ఫిరోజ్ ఖాన్, ఆర్గనైజర్ సెక్రెటరీ జల్లారపు ప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply