Hyderabad | పలు ప్రాంతాల్లో వర్ష సూచన..

Hyderabad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారింది. మధ్యాహ్నం నుంచి ఎండలు తగ్గి మేఘాలు కమ్ముకోవడంతో చల్లటి వాతావరణం నెలకొంది. హకీంపేట్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, కూకట్‌పల్లి, బాచుపల్లి, సుచిత్ర, నిజాంపేట్, ఆల్వాల్, మేడ్చల్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే జీడిమెట్ల, దూలపల్లి, బహదూర్‌పల్లి, గండిమైసమ్మ ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది.

ఇక రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేశాయి. గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది. భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో నిన్న మధ్యాహ్నం వర్షం పడడంతో రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న తడిసిపోయింది.

Leave a Reply