CM Revanth Reddy | సమస్యలు తీర్చి.. నిధులు కేటాయించాలి..!

CM Revanth Reddy | సమస్యలు తీర్చి.. నిధులు కేటాయించాలి..!

  • పీఎస్ఎంహెచ్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రచ్చ మురళి..

CM Revanth Reddy | మాక్లూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(Chief Minister Revanth Reddy) ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రచ్చ మురళి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, పాఠశాలల బలోపేతానికి గతంతో పోలిస్తే ప్రభుత్వం ఈ బడ్జెట్ లో మరింత నిధులు కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు.

ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్‌సీ అమలు చేయడంతో పాటు పెండింగ్ బిల్లులను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలియజేశారు. తమ విజ్ఞప్తికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ప్రాథమిక పాఠశాలలు బలంగా ఉంటేనే ఉన్నత విద్యకు పునాది బలపడుతుందని స్పష్టం చేశారని తెలిపారు.

త్వరలోనే డీఏలు, పీఆర్‌సీ అమలు చేయడంతో పాటు పెండింగ్ బిల్లుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీఎస్ఎంహెచ్ఏ తెలంగాణ రాష్ట్ర సంఘం తరపున రచ్చ మురళి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply