HYD | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం

HYD | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ నూతన శాసనసభ్యుడిగా వల్లాల నవీన్ యాదవ్ మంగళవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఆయన ఘనంగా ప్రమాణం చేయగా, ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడిన నవీన్ యాదవ్.. ప్రజల ఆశలు–నమ్మకాలను నిలబెట్టుకునే బాధ్యతతో పనిచేస్తానని తెలిపారు. ప్రజా సేవనే తమ అత్యున్నత ధ్యేయంగా భావించి, జూబ్లీహిల్స్ అభివృద్ధిని వేగవంతం చేయడంలో అన్ని విధాలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమం అంశాలనే ప్రధాన ఎజెండాగా తీసుకుని, నియోజకవర్గ ప్రజలకు మరింత సమీపంగా సేవ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మౌలిక వసతుల బలోపేతం, అభివృద్ధి పథకాల అమలు, యువతకు అవకాశాల విస్తరణ వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, మంత్రివర్యులు దుదిల్ల శ్రీధర్ బాబు, అజారుద్దీన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఫైన్ ఖురేషి, పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానం ఉన్న ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు..

Leave a Reply