అర్హులైన పేదలకే ఇండ్లు….
అర్హులైన పేదలకే ఇండ్లు….
కడం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి వారిని ఆదుకుంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్(Vedama Bojju Patel) అన్నారు. సోమవారం కడెం మండలంలోని కొండుకూర్ గ్రామంలో అల్లి సుజాత ముత్యంల నూతన ఇందిరమ్మ ఇల్లు నూతన గృహ ప్రవేశమునకు కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో రాష్ట్రంలో పాలన కొనసాగించిన బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు మంజూరు చేయలేదన్నారు. రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఈ సందర్భంగా నూతన గృహ ప్రవేశానికి(enter the House) వచ్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు కు శాలువలు కప్పి గృహ లబ్ధిదారులు అల్లి సుజాత ముత్యం సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్(Padigela Bhushan), కడం మండల తహసిల్దార్ ఆర్ ప్రభాకర్, ఇన్చార్జి ఎంపీడీఓ రమేష్ రెడ్డి, పి ఆర్ హౌసింగ్ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పి సతీష్ రెడ్డి, కడెం మాజీ వైస్ ఎంపీపీ పీ. సంతోష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రేంకల శ్రీనివాస్ యాదవ్, మండల నాయకులు తరి శంకర్, ముసుకు రాజేందర్ రెడ్డి, షేక్ రఫీక్, డి రాజశేఖర్, బొడ్డు గంగన్న, బబ్లు టి రమేష్, ఆకుల లచ్చన్న, తక్కల సత్తన్న, ఎండి షర్ఫుద్దిన్, పి రాజు, మోరపాక రాజు, మాదం గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
