Congress | అందుకే పార్టీలో చేరాను..

Congress | అందుకే పార్టీలో చేరాను..

Congress, క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న వివేక్ వెంకటస్వామి క్యాతన్ పల్లిలో చేస్తున్న పలు అభివృద్ధి పనులను చూసి పార్టీలో చేరానని బుర్కల విక్రమ్ గౌడ్ అన్నారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ 11వ వార్డు శివాజీ నగర్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ కు చెందిన సామాజిక కార్యకర్త బుర్కల విక్రమ్ గౌడ్ సోనియా దంపతులు, అతని మిత్రులు అశోక్, జంజరాల కృష్ణ, పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అనంతరం బుర్కల విక్రం గౌడ్ మాట్లాడుతూ.. నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారికి మంత్రి వివేక్ వెంకటస్వామి శాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, డీసీసీ ప్రెసిడెంట్ పల్లె రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వడ్నాల శ్రీనివాస్, అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, నీలం శ్రీనివాస్, డీకొండ శ్యామ్ గౌడ్ పలువురు కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply