20 రోజులలో 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం…

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : 2025 వానాకాలం పంట సీజన్ రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా(Estimated at 80 lakh metric tonnes)తో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. వానాకాలం పంట కొనుగోలుపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సీఎస్ కే.రామకృష్ణ రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్(video conference) ద్వారా సమీక్ష నిర్వహించారు.

పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి. వేణుతో కలిసి వీసిలో పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 1640 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు(up to 1640 grain purchase centers) ఇంకా ఓపెన్ చేయలేదని, వీటిని తక్షణమే ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటలలోగా చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం రైతులకు కమిట్మెంట్ ఇచ్చిందని, దీనికి అనుగుణంగా వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు.

కోనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం అంచనా వేస్తూ అవసరమైన మేర వాహనాలు, ఇతర ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. దేశ చరిత్రలోనే మొదటిసారి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఒకే సీజన్ లో కొనుగోలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు సంబంధించి పత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలకు ఎప్పటికప్పుడు రిజెండర్ జారీ చేయాలని మంత్రి తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్ఫాలిన్ కవర్లు, గన్ని బ్యాగులు, ప్యాడి క్లీనర్లు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ*l అకాల వర్షాల కారణంగా లక్ష 10 వేల ఎకరాల పంట నష్టం(crop loss of 1 lakh 10 thousand acres) జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ధాన్యం కొనుగోలు కట్టుదిట్టంగా జరుగుతూ రైతులకు ఉపశమనం లభించేలా పని చేయాలని అన్నారు. తేమ శాతం లేకపోయినా కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదని అన్నారు. పత్తి, ధాన్యం పంటలు ఆర బెట్టుకుని నిర్ణీత తేమశాతం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వెళ్తే రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని మంత్రి తెలిపారు.

రైతులకు సౌకర్యంగా ఉండే విధంగా సమీపంలో గల జిన్నింగ్ మిల్లు(ginning mill) కు మ్యాప్ చేసి పత్తి పంట విక్రయం జరిగేలా చూడాలని అన్నారు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో 3 లక్షల 41 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంతో జిల్లాలో 394 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామని తెలిపారు. రాబోయే 20 రోజులలో 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈవో నరేందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply