Andhra Pradesh Police Welfare | పోలీసుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Andhra Pradesh Police Welfare | పోలీసుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Andhra Pradesh Police Welfare | హోంగార్డులకు రూ.33 లక్షల ఆరోగ్య భీమా
విశాఖలో పథకాన్ని ప్రారంభించిన మంత్రి అనిత
పాస్టర్ అభినయ్ దర్శన్ కేసుపై లోతైన విచారణ
విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యల హెచ్చరిక

Andhra Pradesh Police Welfare | ఎంవీపీ కాలనీ (విశాఖసిటీ), ఆంధ్రప్రభ : పోలీసుల సంక్షేమంతో పాటు, హోంగార్డుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేకంగా ఆరోగ్య భీమా అందుబాటులోకి తీసుకువచ్చామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డ్స్‌కు ఆరోగ్య భీమా పథకాన్ని ప్రారంభించి, ఆయా కార్డులను హోం మంత్రి అనిత అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారని, దీంతో వారి ఆరోగ్యంతో పాటు సంక్షేమానికి తొలి ప్రాధాన్యతనిస్తూ ఉన్నతాధికారి నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకూ ఆరోగ్య భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో ముందుగా 975 మంది హోంగార్డులకు హెల్త్ ఇన్సూరెన్స్ అందించామని, రూ.33 లక్షల హెల్త్, రిస్క్ కవరేజ్ ఉంటుందని తెలిపారు.

విశాఖ సీపీ Shankhabrata Bagchi మాట్లాడుతూ దేశంలో మొదటిసారిగా విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డులకు ఆరోగ్య భీమా అందించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, హోంగార్డులు పాల్గొన్నారు.

పాస్టర్ కేసును లోతుగా విచారణ చేస్తున్నాం..

పాస్టర్ అభినయ్ దర్శన్ వ్యవహారంలోని రాజకీయ కోణంపై కూడా ప్రత్యేక విచారణ జరుగుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కుట్ర కోణం లేకపోతే కడప నుంచి ఎందుకు అల్లూరి జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అభినయ్ దర్శన్ అమాయకపు గిరిజనులను నమ్మించి పాస్టర్ అవతారం ఎత్తారని, అభినయ్ దర్శన్‌పై దాడి జరగకపోయినా జరిగిందని నమ్మించాడన్నారు.

ఈ వ్యవహారంలో ఎవరు ఉన్నారనేది త్వరలో బయటపడుతుందని తెలిపారు. ఇప్పటికే అభినయ్ దర్శన్‌పై క్రిమినల్ కేసులు ఉన్నాయని స్పష్టం చేశారు. వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేశారని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే కోణం ఉందనే నేపథ్యంలో విచారణ చేస్తున్నామని అన్నారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.

Leave a Reply