Helmet, Scarf | మాంజా… మరణమృదంగం…

Helmet, Scarf | మాంజా… మరణమృదంగం…
- నిషేధం కాగితాలపైనే… ప్రాణాలు గాలిలోనే!
- చైనా మాంజా కట్టడిలో యంత్రాంగం ఫెయిల్…
- చట్టపరమైన నిషేధం ఉన్నా
- తయారీపై కఠిన చర్యలు లేవు
- అమ్మకాలపై పర్యవేక్షణ లేదు
- వినియోగదారులపై అవగాహన శూన్యం
- నామమాత్రపు తనిఖీలతోనే హడావుడి…
- అంతా సోషల్ మీడియాలో వైరల్ అవడానికే…
- దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీకి
- మానవ హక్కుల సంఘం నోటీసులు…
Helmet, Scarf | ఆంధ్రప్రభ : రాష్ట్రంలో చైనా మాంజాతో ప్రమాదాలు రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. చైనా మాంజాను నిరోధించడంలో పోలీసు యంత్రాంగం విఫలమయ్యిందనే ఆరోపణలు వస్తున్నాయి. రోజూ పత్రికల్లో, టీవీల్లో చైనా మాంజా(China Manja)పై పోలీసుల ఉక్కుపాదం, వందలకొద్ది బాబిన్లు స్వాధీనం అంటూ వార్తలు చూస్తుంటాము. అదంతా నామామాత్రమే… తనిఖీలు, కేసులు కేవలం సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పాపులర్ అవడానికే తప్ప అంతర్గతంగా జరిగేది మాత్రం ఏమిలేదన్న ప్రచారం జరుగుతోంది.
పోలీసులు చైనా మాంజా అమ్మడం, కొనడం విషయంలో అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మాంజా స్వాధీనం, దాడులు అంటూ పోలీసు శాఖ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్టు(videos posted) చేస్తోంది. కానీ అదే సమయంలో రోడ్లపై ప్రజల ప్రాణాలు గాలిలో వేలాడుతున్నాయి. హెల్మెట్, స్కార్ఫ్(Helmet, Scarf), మఫ్లర్లు కూడా మాంజా ముందు నిరుపయోగంగా మారుతున్నాయి.

అంతేకుకుండా హైదరాబాదు నగరంలోనే చైనా మాంజా తయారీ జరుగుతున్నా… తయారీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారని వినికిడి. అమ్ముతున్నవారిపైన మాత్రమే చర్యలా… తయారీదారులపైన చర్యలు లేవా అని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. నిషేధిత చైనా మాంజాతో రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాదు నగరంలో వరుస ప్రమాదాలు జరగడం కలకలం రేపుతున్నది. ఈ నిర్లక్ష్యంపై హైదరాబాద్ సీపీకి మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది.

Helmet, Scarf | చట్టం కాగితాలపై… మాంజా రోడ్లపై…
చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ, అది బ్యాక్‌డోర్ మార్కెట్లలో బహిరంగంగానే అమ్ముడవుతోంది. వాట్సాప్ డీల్స్, సోషల్ మీడియా లింకులు, రహస్య సరఫరా…ఇవన్నీ అధికారులకు తెలియవా? లేదా తెలిసినా చూడనట్టు ఉండడమే విధానమా? ప్రాణాల కంటే పబ్లిసిటీ ముఖ్యమా? పోలీసు శాఖ(police department) సోషల్ మీడియా పోస్టుల్లో మాంజా కాయిల్స్ ఫోటోలు కనిపిస్తాయి.

కానీ అదే సమయంలో రోడ్లపై యువకుల మెడలు కోసుకుంటున్న మాంజా మాత్రం కనిపించదు. ఇది చట్ట అమలేనా? లేదా పబ్లిక్ రిలేషన్ వ్యాయామమా? మానవ హక్కుల సంఘం నోటీసులు ఎందుకు వచ్చాయి? హైదరాబాద్ సీపీకి మానవ హక్కుల సంఘం నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే… అది చిన్న విషయం కాదు. ప్రజల ప్రాణ భద్రత హక్కు కాదా? నిర్లక్ష్యం కూడా హక్కుల ఉల్లంఘన కాదా? బాధ్యత లేని వ్యవస్థ… బలులు కోరుతున్న మాంజా… మాంజా గాయాలు ప్రమాదాలు కాదు అవి ముందే నివారించదగిన హత్యలు. కఠిన చర్యలు తీసుకుంటే ఇవి జరగవు. సరఫరా గొలుసును ఛేదిస్తే మాంజా కనిపించదు. కానీ అలా చేయాలంటే నిజమైన సంకల్పం కావాలి. కానీ కనిపిస్తున్నదంతా నిర్లక్ష్యమే తప్పా మరోటి లేదు.
చైనా మాంజా ప్రమాదాలపై పూర్తి నివేదిక ఇవ్వండి..
సజ్జనార్ కు హెచ్ఆర్సీ నోటీసులు…

చైనా మాంజా అమ్మొద్దు.. కొనొద్దని పోలీసులు ఎంత హెచ్చరించినా కొంత మంది పెడచెవిన పెడుతున్నారు. ఈ చైనా మాంజా వల్ల చాలా చోట్ల మనుషుల తలలు, కాళ్లు, చేతులు తెగుతున్నా తమకేమి కాదన్నట్లు మాంజాను గుట్టుగా వినియోగిస్తూనే ఉన్నారు. చైనా మాంజా కట్టడిలో తీసుకున్న చర్యలేమిటి? నిషేధం అమలులో వైఫల్యానికి కారణమెవరు? అనే అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు నోటీసులు(notices) జారీ చేసింది.
రోడ్డుపై వెళ్లే అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతుంటే, కేవలం జరిమానాలతో సరిపెట్టడంపై సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అడ్వకేట్ రామరావు ఇమ్మనేని దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు మాంజా విషయంలో వచ్చే ఫిబ్రవరి 26లోపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నుంచి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
CLICK HERE TO READ MORE : 125 days work | ‘‘వీబీ-జీ రామ్ జీ’’ పథకం ఎందుకు వద్దు?
